Sunday, 31 January 2016

లేచిపోయింది

ఒకమ్మాయి తన ప్రియుడి తో కలిసి లేచిపోయింది . వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా నిస్పృహ లో కూరుకుపోయి ఉన్నారు. మూడు రోజుల తర్వాత ఆ అమ్మాయి ఇంటికి వచ్చింది...
నాన్న : మాకేం చెప్పకు, ముందు బయటకి వెళ్ళిపో....
అమ్మ : మమ్మల్ని ఎలాగో చంపినంత పని చేసావ్ గా, మల్లి ఎందుకు వచ్చావ్..
తమ్ముడు : మా పరువు తీసింది చాలలేదా, మల్లి ఎందుకు వచ్చావ్, వెళ్ళిపో....
ఇలా ఇంట్లో ప్రతి ఒక్కరు ఆ అమ్మాయిని ఏదో ఒకటి అంటూనే ఉన్నారు, తను ఏమి అనకుండా తన రూం కి వెళ్లి కొద్దిసేపటి తర్వాత వెళ్లిపోతుంటే, వాళ్ళమ్మ అడిగింది.. ఎందుకొచ్చావ్ అని.. అప్పుడు ఆ అమ్మాయి చెప్పిన సమాదానికి ఇంట్లో అందరు కరిగిపోయి కన్నీరు పెట్టుకున్నారు.
:
అమ్మాయి : నా ఫోన్ ఛార్జెర్ మరిచిపోయాను, సన్న పిన్ను ఛార్జెర్ లు బయట దొరకటంలేదు, అందుకే తీసుకెళ్లటం కోసం వచ్చాను.

No comments:

Post a Comment