Sunday, 31 January 2016

ముద్దులు

స్వాతి, కిషోర్‌ల మధ్య గొడవ వచ్చి పోట్లాడుకున్నారు. స్వాతి, కోపంగా అంది. " ఛీ! ఇకనుంచి నాతో మాట్లాడకు నీ ముఖం నాకు చూపించకు పో!"
"అయితే ఇంతకాలం నేనిచ్చిన ప్రజంటేషన్‌లు, లవ్ లెటర్లు, అన్నితిరిగిచ్చేయాలి" అన్నాడు కిషోర్.
"అలాగే" అంది స్వాతి అదేమంత పెద్ద విషయం కానట్టు.
"అంతేకాదు ఇంతకాలం నేను పెట్టిన ముద్దులు కూడా తిరిగి ఇచ్చేయాలి" అని హెచ్చరించాడు కిషోర్.

బిల్లు

రాము: "మీ హోటల్‌కి ఇంకెప్పుడూ రాను.." కోపంగా అన్నాడు రాము!
మేనేజర్ : "ఏమైంది సార్"
రాము: " నాకింకేమీ వద్దన్నాక మీ సర్వర్ బిల్లు తెచ్చిచ్చాడు..." మరింత కోపంగా చెప్పాడు రాము.

పిల్లాడు

పిల్లాడు : అమ్మా, గాంధీ తాత తలమీద వెంట్రుకలుండవు ఎందుకని?
అమ్మ : ఎందుకంటే అతను ఎప్పుడూ నిజమే మాట్లాడుతాడు గనుక.
పిల్లాడు : ఒహో, ఇప్పుడర్ధమైంది. ఆడాళ్ళందరి జుట్టు ఎందుకంత పెద్దగా ఉంటుందో

లేచిపోయింది

ఒకమ్మాయి తన ప్రియుడి తో కలిసి లేచిపోయింది . వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా నిస్పృహ లో కూరుకుపోయి ఉన్నారు. మూడు రోజుల తర్వాత ఆ అమ్మాయి ఇంటికి వచ్చింది...
నాన్న : మాకేం చెప్పకు, ముందు బయటకి వెళ్ళిపో....
అమ్మ : మమ్మల్ని ఎలాగో చంపినంత పని చేసావ్ గా, మల్లి ఎందుకు వచ్చావ్..
తమ్ముడు : మా పరువు తీసింది చాలలేదా, మల్లి ఎందుకు వచ్చావ్, వెళ్ళిపో....
ఇలా ఇంట్లో ప్రతి ఒక్కరు ఆ అమ్మాయిని ఏదో ఒకటి అంటూనే ఉన్నారు, తను ఏమి అనకుండా తన రూం కి వెళ్లి కొద్దిసేపటి తర్వాత వెళ్లిపోతుంటే, వాళ్ళమ్మ అడిగింది.. ఎందుకొచ్చావ్ అని.. అప్పుడు ఆ అమ్మాయి చెప్పిన సమాదానికి ఇంట్లో అందరు కరిగిపోయి కన్నీరు పెట్టుకున్నారు.
:
అమ్మాయి : నా ఫోన్ ఛార్జెర్ మరిచిపోయాను, సన్న పిన్ను ఛార్జెర్ లు బయట దొరకటంలేదు, అందుకే తీసుకెళ్లటం కోసం వచ్చాను.

ఇద్దరు

ఒక రూం లో ఇద్దరు Twins కూర్చుని ఉన్నారు.
ఒకడేమో ఏడుస్తున్నాడు, ఒకడేమో పడీ పడీ నవ్వుతున్నాడు..
అది చూసి, వాళ్ళ నాన్న అడిగాడు.
" ఒరేయ్, వాడు ఏడుస్తుంటే, నువ్వెందుకురా నవ్వుతున్నావ్? "
అందులో ఒకడు: హహహ.. ఇంత చలిలో మమ్మీ నేననుకుని వీడికి రెండో సారి స్నానం చేయించింది....

వంట

భార్యా భర్తలు ఒక సారి డిన్నర్ కి ఒక రెస్టారెంట్ కి ఫుడ్ ఆర్డర్ ఇస్తారు, సెర్వ్ చెయ్యడం అవ్వగానే భర్త వెంటనే ' వావ్, నోరూరుతోంది, పట్టు మొదలెడదాం' అంటాడు,
భార్య: హనీ, నువ్వు తినేముంది ప్రేయర్ చేస్తావుగా, మర్చిపోయావా?
భర్త : అది మనిల్లు డార్లింగ్, ఇక్కడ చెఫ్ కి ఎలా వండాలో తెలుసు

హల్వా

రాధ : హల్వా ఎలా ఉంది?
రవి : నీకు ప్రతీది శుభ్రంగా ఉంచడం అలవాటు కదా?
రాధ : మీకెలా తెలుసు?
రవి : ఏం లేదు.. హల్వా వాసన కన్నా విమ్ సబ్బు వాసనే ఎక్కువగా ఘుమ ఘుమలాడుతుంటే..!

Thursday, 28 January 2016

నొప్పి

పేషంట్: డాక్టర్, నేనెక్కడ ముట్టుకుంటే అక్కడ నొప్పిగా ఉంటుంది."
డాక్టర్: ఏమంటున్నావ్?
పేషంట్: అవునసీజ్డాక్టర్. నేను నా భుజం పట్టుకుంటే అక్కడ నొప్పిగా ఉంటుంది. మోకాలు టచ్ చేస్తే అక్కడా నొప్పిగా ఉంటుంది. ఓహ్ నా నుదురు పట్టుకున్నప్పుడు కూడా... చాలా యిబ్బంది పెడుతుంది డాక్టర్....
డాక్టర్: OK, నాకిప్పుడు అర్ధమైంది. నీ చేతి వ్రేలు విరిగింది...

కోళ్ళ ఫారం

కోళ్ళ ఫారం తనిఖీ చేయడానికి ఆఫీసర్ గారు వచ్చారు.?
.
ఆఫీసర్: ఈ కోళ్ళకి ఆహారంగా మీరు ఏమిస్తారు?
.
రామ్ కుమార్ : రాగులు ఇస్తాం సర్. అది మంచి ఆహారం కదా...
.
ఆఫీసర్: ఇంత ఎండా కాలం లో రాగులు ఇస్తారా? వేడి చేస్తుంది వాటికి. ఈయన్ని అరెస్ట్ చేయండి..
.
ఆఫీసర్; మరి నువ్వో?
.
ధర్మ : నేను బియ్యం గింజలు వేస్తానండి..
.
ఆఫీసర్: తప్పు ఆంసర్.. వీడిని కూడా అరెస్ట్ చేయండి..
.
ఇది బాగా గమనించిన వెంకీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి,
.
" నేను అసలు ఆహారమే ఇవ్వను సర్."
.
ఆఫీసర్ : ఆహారమే ఇవ్వవా? క్షమించరాని నేరం.. ఉరి శిక్ష వేయాలి నీకు...
.
వెంకీ : పూర్తిగా వినండి మహానుభావా..
వాటికి తలా ఒక 5 రూ. ఇస్తాను నేను.
వాటికి ఇష్టం వచ్చినవి అవే కొనుక్కుని తినేస్తాయ్.
మరి వాటికి మేము ఏం పెట్టినా ఇబ్బందే కదా మీకు...!!

నాటకం

స్కూలు యానివర్సరీ నాటకంలో సెలక్ట్ అయ్యనమ్మా అంటు గేంతుతూ వచ్చాడు రాజేష్
అలాగా .. ఏం పాత్రరా
భర్త పాత్ర అమ్మ
అదేందూకు తీసుకున్నవురా!! ఏదైనా డైలాగులు ఉన్న పాత్ర అడక్కపోయవ...

I LOVE YOU

పెళ్ళైన ఆడవాళ్ళ మీటింగ్ జరుగుతుంది. అక్కడ మీటింగ్ కండక్ట్ చేస్తున్న ఒకావిడ ఒక question అడుగుతుంది.' మీరు మీ భర్తకు ఐ లవ్ యు అని చివరిసారిగా ఎప్పుడు చెప్పారు?' అని.
ఈ రోజు చెప్పాను ఒకరు, రెండు రోజుల క్రితం అని ఒకరు, వారం క్రితమని మరొకరు అన్నారు. ఇంతలో ఆమె 'సరే ఇప్పుడు మీ ఫోన్ తీసుకొని మీరంతా మీ మీ భర్తలకు 'I LOVE YOU అని పంపండి. ఎవరికైతే 'Awesome' వస్తుందో వారికి ఒక Surprise GIFT అని చెప్తుంది. అక్కడ ఉన్న వారంతా వాళ్ళ భర్తలకు 'I LOVE YOU అని మెసేజ్ పంపిస్తారు. కొంత సేపటి తరువాత వాళ్ళ Husband replies ఇలా ఉన్నాయి.
1. Sweety ని Condition OK కదా?
2. ఈ రోజు మళ్ళీ వంట చెయ్యలేదా?
3. డార్లింగ్, Home maintanance కి ఇచ్చిన money అయిపోయిందా?
4. ఏంటి సంగతి?
5. నువ్వేమైనా కల కన్నావా, లేక నేను కంటున్నానా?
6. నువ్వెళ్ళిన ఫంక్షన్ లో ఎవరిదైనా jewelry నచ్చిందా?
7. ఆఫీస్లో ఇంత టెన్షన్ లో ఉంటే ఈ time లో ఇలాంటి మెసేజెస్ పంపిస్తావు, ని తలకయేమైనా దేబ్బతగిలిందా?
8. ఎన్ని సార్లు చెపాను ఆ ఏడుపుగొట్టు serials చూడొద్దని?
9. ఓహొ.. మళ్ళీ accident చేసావా?
10. పిల్లాడిని ఇవ్వాళ కూడా నెనె school నుండి తీసుకురావాలా?
చివరికి ఎవరైతే gift గెలుచుకున్నారో వాళ్ళ message ఏమిటంటే....
.
..
.
.
.

'

'
'
11. Who is this?

competition

ఒక భిక్షగాడికి లాటరీ తగిలి 50 కోట్లు వచ్చాయ్..
వెంటనే ఒక పెద్ద హోటల్్ కట్టించేశాడు...
.
అది చూసిన ఒకడు అడిగాడు..
.
" మీరు హోటల్ మాత్రమే కట్టించడానికి కారణం ఏంటి? ఆ డబ్బుతో ఇంకేదిన చేయచ్చు కదా.."
.
.
.
.
.
.
బిక్షగాడు: ఇప్పుడు నా హోటల్ ముందు నేను మాత్రమే అడుక్కుంటా..
ఇంకెవ్వరికీ అవకాశం ఇవ్వను..
ఏం చేద్దాం గురూ..
వెధవది competition ఎక్కువ అయిపోయింది ఈ మధ్య.....!!

తాజ్ మహల్

భార్య : షాజహాన్ భార్య కోసం తాజ్ మహల్ కట్టాడు. మరి నువ్వు?
భర్త : నేనైతే ఏటి గట్టున స్తలం కొని రెడీగా వున్నా ఇక నీదే ఆలస్యం

Wednesday, 27 January 2016

get togethe

రాజు : నాన్నా స్కూల్లో ఒక చిన్న get together ఉంది వస్తావా?
తండ్రి : చిన్న గెట్ టుగెదెరా? అదేంటిరా?
రాజు : హా, అవును, కేవలం నువ్వూ, నేను ఇంకా మా
హెడ్ మాస్టరూనూ, అంత

కష్టమర్ కేర్

హలో కష్టమర్ కేరా? 
అవును చెప్పండి సార్, నేను మీకెలాగ ఉపయోగపడగలను?
సార్! మావాడు SIM కార్డ్ మింగేశాడండీ...
అయ్యో! కానీ దానికి నేనేం చేయగలనండీ...
ఆ SIM కార్డులో వంద రూపాయలు బాలన్స్ ఉంది.
ఐతే నేనేం చేయగలనో చెప్పండి సార్
ఏం లేదు, వాడు మాట్లాడుతుంటే బాలన్స్ కట్ అవుతుందా?
????

Tuesday, 26 January 2016

ఎవరో

"ఈ రోజు మీ ఇంట్లో బెండకాయ కూర చేశారు కదూ వదినా?"
"అరె! అంత కరెక్టుగా ఎలా చెప్పగలిగారు?"
"రాత్రి మా దొడ్లో బెండకాయలు ఎవరో దొంగవెధవలు కోసుకెళ్ళార్లే"

రెండో పెళ్ళి

రాణి: మీ వారు రెండో పెళ్ళి చేసుకుంటానంటే సిగ్గు, శరం లేకుండా ఒప్పేసుకున్నారట!
వాణి: మా అత్తగారితో పోట్లాడడానికి నేనొక్కదాన్నే సరిపోవడం లేదు. అందుకే ఆయనకు రెండో పెళ్లి

పెళ్ళికి సిద్దం

కుర్రాడు : నాన్నా, నేను పెళ్ళి చేసుకుంటాను.
తండ్రి : First, Sorry చెప్పు.
కుర్రాడు : ఎందుకు?
తండ్రి : నువ్వు Sorry చెప్పు ముందు.
కుర్రాడు : అదేంటి నేనేమీ తప్పు చెయ్యకుండా Sorry ఎందుకు చెప్పాలి?
తండ్రి : ముందు Sorry చెప్పు.
కుర్రాడు : సరే Sorry.
తండ్రి : Good. ఇప్పుడు నువ్వు పెళ్ళికి అర్హుడివి. ఎప్పుడైతే నీ తప్పు లేకుండా Sorry చెప్తావో అప్పుడు నువ్వు పెళ్ళికి సిద్దం కావచ్చన్నమాట.

Are you ?

జంబులింగం బీచ్ లో కూర్చుని ఉంటాడు.. అటుగా వెళ్తున్న ఇంగ్లీష్ వాళ్ళు జంబులింగాన్ని అడుగుతారు
ఇంగ్లీష్- are you relaxing?
జంబులింగం -లేదు నేను జంబులింగంని
మరో ఇంగ్లీష్ వా-are you relaxing?
జంబులింగం - అరె! నేను జంబులింగం ని.
(జంబులింగం లేచి నడుస్తుంటాడు. అతనికి మరో వ్యక్తి కూర్చుని కనపడతాడు)
జంబులింగం - are you relaxing.
2వ్యక్తి- yes, I am relaxing.
జంబులింగం -అరె నువ్వు ఇక్కడు కూర్చున్నావా. అక్కడ అంతానీ గురించి వెతుకుతున్నారు.

టైం వేస్ట్

ఒక ఫాక్టరీలో ఒక వ్యక్తి ఎటువంటి బాధ్యతలేకుండా నేలవైపు చూస్తూ అనాలోచితంగా ఉంటాడు. 
అటుగా వెళ్ళే ఆ ఫాక్టరీ CEO ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి నీ జీతం ఎంత అని అడుగుతాడు.
వ్యక్తి : ఆరు వేలు సార్. 
CEO : నేను వర్కర్లకు జీతం ఇచ్చేది పని చెయ్యడానికి, టైం వేస్ట్ చెయ్యడానికి కాదు, ఇదిగో 18000, మూడు నెలల జీతం, ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు.
ఆ వ్యక్తి డబ్బులు తీసుకొని అక్కడినుండి వెళతాడు, అప్పుడు ఆ CEO మిగతా వర్కర్లను అడుగుతాడు ఎవరా వ్యక్తి అని,
ఇంతలో వర్కర్లు చెబుతారు 'పిజ్జా బాయ్ సార్ '

కుక్కలు కుక్కలు

టీచర్: నేను నీకు రెండు కుక్కలు, మరి రెండు కుక్కలు మళ్ళీ రెండు కుక్కలు ఇచ్చాననుకో. నీ దగ్గర మొత్తం ఎన్ని కుక్కలు ఉంటాయి?
సంతోష్: ఏడు.
టీచర్: కాదు. ఇప్పుడు చెప్పు. నీకు నేను మొదట రెండు నారింజపళ్ళు, మరి రెండు నారింజపళ్ళు, మళ్ళీ రెండు నారింజపళ్ళు ఇచ్చాననుకో. మొత్తం నీ దగ్గర ఎన్ని నారింజపళ్ళుంటాయి?
సంతోష్: ఆరు!
టీచర్: గుడ్. ఇప్పుడు చెప్పు. నేను నీకు రెండు కుక్కలు, మరి రెండు కుక్కలు, ఇంకా రెండు కుక్కలు ఇచ్చాననుకో. మొత్తం నీ దగ్గర ఎన్ని కుక్కలు ఉంటాయి?
సంతోష్: ఏడు.
టీచర్: రెండేసి కుక్కలు మూడు ఒకటిగా కలిపితే ఏడెలా అవుతాయి బాబూ?
సంతోష్: ఇప్పటికే ఇంటిదగ్గర నాకు ఒక కుక్క ఉంది కదా టీచర్!

అబద్ధాల మిషన్

ఒక గొప్ప శాస్త్రజ్ఞుడు ఓ మహిళల సభలో పెద్ద ఉపన్యాసం ఇచ్చాడు. స్టేజి దిగిపోయాక చాలా మంది స్త్రీలు అతని చుట్టూ మూగి, కుతూహలంగా ఎవేవో ప్రశ్నలడగసాగారు.
ఓ స్త్రీ అందరిని తోసుకుంటూ ముందుకు వచ్చి అడిగింది..." అబద్ధాలను కనిపెట్టే మిషన్లను కనిపెట్టానుంటున్నారు. మీరు దాన్ని చూశారా? "
"చూడాటమేంటి నా తలకాయ! ఒక దాన్ని పెళ్ళి చేసుకున్నాను కూడా!" అన్నాడా సైంటిస్ట్ బాధగా

తల్లి : కూతురు

ఎనిమిదేళ్ళ కూతురు తన మొఖం దీనంగా పెట్టడం చూసి తల్లి ఇలా అడుగుతుంది.
తల్లి : ఏమైందమ్మా? ఎందుకంత డల్ గా ఉన్నావు?
కూతురు : అమ్మా నేను పిచ్చిదానిలా ఉంటానా? 
తల్లి : లేదే!
కూతురు : నా ముక్కు చింతపిక్కలా ఉంటుందా?
తల్లి : లేదు..
కూతురు : నేను బండలా ఊరినట్టు కనిపిస్తానా ?
తల్లి: లేదమ్మా..
కూతురు : నేను ఓదురు కప్పలా ఉంటానా?
తల్లి : లేదే, ఇంతకీ ఎవరేమన్నారు నిన్ను?
కూతురు : మరి అందరూ నన్ను మీ అమ్మలా ఉన్నావంటారెందుకు ?

మైండ్ బ్లాక్

మొగుడు కోపంతో కేకలేసుకుంటూ ఇంట్లోకి వచ్చాడు
భార్య: ఏమైందండి..
భర్త: అపార్ట్ మెంట్ ఓనర్ తో గొడవ జరిగిందిలే..
భార్య: ఎందుకు...?
భర్త: ఈ అపార్టెమెంట్ లో ఒక్కరు తప్పితే .. ఆడవాళ్లందరితో తనకు లింక్ ఉందని ఓనర్ మన వాచ్ మెన్ తో చెబుతుంటే విన్నా.
ఆ ఒక్కతి ఎవరో చెప్పమంటే అస్సలు చెప్పడం లేదు
భార్య: మన పై ఫ్లోర్ లో ఉండే రమ్య అయి ఉంటది..ఎందుకంటే ఎప్పుడూ ఆమె ఓనర్ తో గొడవపడుతూ ఉంటది...
భార్య సమాధానంతో భర్త మైండ్ బ్లాక్ అవుతుంది..

Monday, 25 January 2016

నిజమేగా!

టీచర్ : గాడిదకు మనిషికి తేడా ఏంటి!
విద్యార్థి : మనిషి గాడిదవ్వగలడేమో కాని, గాడిద మనిషికాలేదు.
టీచర్ : ఓరి గాడిదా!
విద్యార్థి: చూశారా సార్! నేను చెప్పింది నిజమేగా..

Speak in English

చింటు: అమ్మా, నాతో అబద్దం ఎందుకు చెప్పావు? 
అమ్మ : I have already told you, whenever you speak, speak in English. 
చింటు : Ok mom, why did you lie to me? 
అమ్మ : When my son?
చింటు : You said, my younger sister is an angel.
అమ్మ : Yes, she is.
చింటు : Then, why didn't she fly when I threw her from our balcony.
అమ్మ : ఒరేయ్ దున్నపోతా, సచ్చినోడా తలకుమాసిన వెధవ, ఎక్కడ పడేసావురా దాన్ని. నెల తక్కువ వెధవ.
చింటు: Mom, speak in English please.

చీకటి

ఇద్దరు factory workers యిలా మాట్లాడుకుంటున్నారు.
మొదటివాడు: నేను ఎలాగైనా మన Owner చేత ఇవ్వాళ సెలవ ఇప్పించుకుంటా!!
రెండవవాడు: అదెలాగ?
(ఇంతలో ఆ factory owner రావడం గమనించి మొదటివాడు గదిలో fan కి వ్రేలాడుతూ ఉంటాడు )
యజమాని: అక్కడేంచేస్తున్నావ్?
మొదటివాడు: నేను లైటుని...
యజమాని: నీకు పనెక్కువ చెయ్యడంవల్ల బుర్ర పాడైనట్టుంది గానీ ఇంటికెళ్ళి రెస్టు తీసుకో...
(రెండవ వాడు కూడా మొదటి వాడిని అనుసరిస్తూ వెళ్ళబోతాడు)
యజమాని: నువ్వెక్కడికిరా?
రెండవవాడు: ఇంటికి వెళ్తున్నా అయ్యగారు. నేను చీకటిలో పనిచెయ్యడం నా వల్ల కాదు

మంచి వార్త

ఆఫీసు పనితో విసిగిపోయి ఇంటికి వచ్చిన భర్త "నీవిప్పుడు చెడు వార్తలేమీ చెప్పకు. మంచి వార్త ఏదైనా చెప్పు.." అన్నాడు భార్యతో.
"మన ముగ్గురమ్మాయిల్లో చిన్నవాళ్ళిద్దరూ ఎవరితోనూ లేచిపోలేదండీ.." అంది భార్య నసుగుతూ

confirm

ఒక కార్పోరేట్ ఆఫీస్ లో బాస్ ఒక జోక్ చెప్తాడు. తన క్రింది ఉద్యోగులందరూ నవ్వుతారు. ఒకతను మాత్రం నవ్వకుండా చూస్తూ ఉంటాడు. అప్పుడాయజమాని ఇల అడుగుతాడు. 
యజమాని : ఏం, నీకు నవ్వు రాలేదా? 
ఉద్యోగి : లేదు సార్, నాకు వేరే కంపెనీ లో confirm అయింది.

టింకు: చింటూ

టింకు: ఏరా చింటూ, ఎలా ఉన్నావ్?
చింటు: సూపర్ రా...
టింకు: చదువు ఎలా సాగుతుంది రా? మార్కులు బానే వస్తున్నాయా?
చింటు: ఫ్రెండ్ వి ఫ్రెండ్ లా వుండు. ఇంటికి వచ్చే చుట్టాల లా వెధవ ప్రశ్నలు వేశావంటే, చంపేస్తా....

ఆ సినిమా

ఆ సినిమాకు నిన్న రాత్రి నీ గర్లఫ్రేండ్ తో కలిసి వెళ్ళావు కదారా . . మళ్ళీ వెళ్తానంటావేంటి . . ? 
.
.
.
.
.
.
.
.
ఇప్పుడు సినిమా చూడడానికి వెళ్తున్నా

చీమ ఏనుగు

ఒక చీమ ఏనుగు ఒక బ్రిడ్జ్ మీద నడుస్తూ వెళుతున్నాయి.ఏనుగు సడెన్గా బ్రిడ్జ్ కిందున్న నదిలోకి చూస్తూ నడుస్తుంది.ఇది గమనించిన చీమ వెంటనే ఏనుగు ను ఒక తన్ను తన్నింది.
.
.
.
.
..
.
.ఎందుకంటే....
.
.
.
.
.
.
.
చీమ పెళ్ళాం నదిలో స్నానం చేస్తుంది మరి.

షాపింగ్

భార్య : నాకు ఒంట్లో
బాగోలేదండీ!
భర్త : అయ్యో, నేను నిన్ను
షాపింగ్ కి
తీసుకెళ్దామనుకున్నానే!
భార్య: అరె, నేను తమాషాకి
చెప్పానండీ
భర్త : నేనూ తమషాకే చెప్పా.
ఇక లేచి వంట చెయ్యి.

Sunday, 24 January 2016

దేవుడు గేదా?

చంటి : అమ్మా!
అమ్మ : ఏంటమ్మా!
చంటి : మజ్జిగ ఎలా ఒస్తుంది?
అమ్మ : పాల నుంచి
చంటి : పాలు ఎలా ఒస్తాయి
అమ్మ : గేదె నుంచి
చంటి : గేదెలా ఒస్తుంది?
అమ్మ : వాళ్ళమ్మ నుంచి
చంటి : వాళ్ళమ్మ ఎలా ఒస్తుంది?
అమ్మ : దేవుడి నుంచి
చంటి : అంటే దేవుడు గేదా?
అమ్మ : ఓరి భగవంతుడా...వీడ్ని ఇలా ఎలా ఇచ్చావు రా నాకు?
చంటి : నన్ను దేవుడిచ్చాడా? అంటే నేను కూడా గేదా?? 

దేవుడు

నర్సరీ స్కూల్ కాంటీన్ లో
ఒకచోట యాపిల్ బుట్టతో
పాటు ఇలా రాసి ఉంటుంది.
"ఒక యాపిల్ కన్నా ఎక్కువ
తీసుకోవద్దు. దేవుడు
చూస్తున్నాడు".
పక్కనే ఇంకో కౌంటర్ దగ్గర
చాక్లెట్స్ బాక్స్ ఉంటుంది. అది
చూసి ఒక పిల్లాడు ఇలా
రాస్తాడు. "మీకు
కావల్సినన్ని చాక్లెట్స్
తీసుకోండి. దేవుడు యాపిల్స్
చూడటంలో బిజీగా
ఉన్నాడు."😜😜😜

రాజు - మహామంత్రి

ఒకానొక రాజ్యంలో, రాజుగారు తన మహామంత్రిని పిలిపించాడు.
రాజు : " రాజ్యంలో మహా తెలివైనవారు వున్నట్లే, మహా తెలివితక్కువ వాళ్లూ వుంటారు కదా ?"
మంత్రి (సంశయిస్తూనే): " అవును . వుంటారు ప్రభూ!"
రాజు : " ఐతే, మన రాజ్యం అంతా గాలించి, అందరిలోకీ అతి తెలివితక్కువ వాళ్లను ఐదుగురిని వెదికి పట్టుకొని, ఇక్కడ సభలో హాజరు పరచండి." అని ఆదేశించాడు.
మంత్రి " చిత్తం ప్రభూ" అని సభనుండి నిస్క్రమించాడే కానీ మనసంతా ఎలా అన్న ఆలోచనలతోనే మస్తిష్కమంతా నిండి పోయింది
కొన్ని పరీక్షలు పెట్టో ప్రశ్నలు అడిగో తెలివయిన వాడో కాదో తెలుసుకోవచ్చు. మరి తెలివితక్కువ వాడినెలా గుర్తించాలి? ఈ సందిగ్దావస్త నుండి బయటపడటమెలాగో అర్ధం కావటంలేదు మంత్రిగార్కి. ఒప్పుకున్నాక తప్పదుగా! రారాజ్ణ మరి. ఒక నెల రోజులపాటు రాజ్యమంతా తిరిగి ఇద్దరిని పట్టుకుని సభలో హాజరు పరిచాడు.
రాజుగారు : " మహామంత్రీ! మీరు పొరబడినట్లున్నారా లేక లెక్క తప్పారా? మేను ఐదుగురిని ప్రవేశపెట్టమన్నాము. కానీ తమరు ఇద్దరిని మాత్రమే వెంట తీసుకొనివచ్చారు"
మహామంత్రి " మహా ప్రభూ! తమరు నేను చెప్పేది కొంచెం ఆలకించండి"
రాజు " సరే సెలవియ్యండి"
మంత్రి :" నేను రాజ్యమంతా తిరిగాడుచుండగా ఇతను ఒక ఎడ్లబండి మీద కూర్చొని తలపై ఒక పెద్దమూటను పెట్టుకొని వెళుతూ కనిపించాడు. అలా ఎందుకు అని అడుగగా, అయన్ను అడుగగా తలపైనున్న మూట, బండి మీద పెడితే ఎడ్లకు భారమవుతుంది అని సమాదానమిచ్చాడు. అందుకే అతను అయిదవ తెలివితక్కువ వాడిగా తీసుకొచ్చాను"
రాజు " భేష్! తరువాత"
మంత్రి :" ఈ రెండో అతను ' తన ఇంటి పైకప్పు మీద పెరిగిన గడ్డిని తినిపించడానికి, తన గేదెను ఇంటి పైకప్పు మీదకు లాగుతూ కనిపించాడు" కావున ఇతన్ని నాల్గవ తెలివితక్కువ వాడిగా ప్రవేశపెట్టాను"
రాజు : " బహు బేషుగ్గా వుంది. తరువాత"
మంత్రి : " రాజ్యంలో చాలా సమష్యలుండగా, వాటినన్నింటినీ ప్రక్కనపెట్టి, తెలివితక్కువ వాళ్లను వెదకటంలో నెల రోజుల పాటు సమయం వృధాచేసాను. కాబట్టి నేను ..... మూడవ తెలివితక్కువ వాడిని."
రాజు ( గట్టిగా నవ్వుతూ ) " తరువాత "
మంత్రి : " పరిష్కరించాల్సిన సమస్యలుండగా, బాద్యతలన్నీ విస్మరించి, తెలివితక్కువ వాళ్ల కోసం వెదుకులాడుతున్న తమరు ..... రెండో వారు"
అది విన్న సభలొని వారంతా నిశ్టేత్తులై బయబ్రాంతులై చూస్తుండిపొయారు. నిశ్సబ్దం ఆవరించింది సభలో.
రాజుగారు తేరుకుని కుతూహలం తో " మంత్రి గారు సందేహం లేదు. మీరు సెలవిచ్చినదాంట్లో వాస్తవానికి దగ్గరగానూ నిశ్సందేహంగా నిజాయితో కూడిన నిజముంది. మరి మీరు మెదటి తెలివితక్కువ వారెవరో తెలియచెప్పండి"
మంత్రి : " చిత్తం మహా ప్రభో! తమ కార్యాలయాల్లొనూ ఇంట్లొనూ చెయ్యవలసిన పనులన్నీ మానుకొని, ఈ joke ని చదువుతున్నవాడే ... ఆ మొదటివాడు

108

కాంతం 108 కి కాల్ చేసింది..
కాంతం: తొందరగా ఒక Ambulance పంపండి. నేను అరటి తొక్క మీద కాలు వేసి జారి పడ్డాను..
అవతలి వ్యక్తి: ఇంత చిన్న దానికి Ambulance పంపడం జరగదండీ..
కాంతం: అది నా కోసం కాదయ్యా బాబూ, నేను పడినప్పుడు మా ఆయన నవ్వాడు. కోపమొచ్చి ఒక్కటిచ్చా. గుడ్లు తేలేశాడు దెబ్బకి. ఇంత వరకు లేవలేదు పాపం.

మా అత్తమ్మ

క్రమం తప్పకుండా రోజూ పుట్టలో పాలు పోస్తున్నారవు . . ఏమిటి సంగతి . . ?
అడిగింది సుజాతమ్మ . .
.
" మా అత్తమ్మ చనిపోయింది ఈ పుట్టలోని పాము వల్లే . " 
చెప్పింది మీనాక్షి . .

భార్య : భర్త

భార్య : ఏమండీ పేరంటానికి వచ్చిన వారికి పసుపు, కుంకుమ లతో పాటు ఇంకా ఏమి ఇవ్వను?

భర్త : నా ఫోన్ నెంబర్.  

Thursday, 21 January 2016

చెక్ బుక్

ఒక బుక్ సెల్లర్ నిర్వహించిన సర్వేలో ఒక మహిళను ఇలా అడుగుతాడు.
బుక్ సెల్లర్ : మిమ్మల్ని జీవితంలో బాగా పైకి తీసుకొచ్చిన బుక్ ఏది?
మహిళ : మా వారి చెక్ బుక్.

Wednesday, 20 January 2016

ప్లీజ్ ప్లీజ్

సుబ్బారావు బస్ కోసం వెయిట్ చేస్తూ బస్టాండ్లో నిలుచున్నాడు.
ఇంతలో ఓ బెగ్గర్ వచ్చి బిచ్చం అడిగాడు.
టెన్ రుపీస్ ప్లీజ్ ఫుడ్డు లేదు.
బీరు కొడతావా? అడిగాడు సుబ్బారావు. 
బిత్తర పోయిన బిచ్చగాడు లేదు సార్ నేను తాగను అన్నాడు.
ఓ కే సిగరెట్ తీసి దమ్ము కొట్టు అన్నాడు సుబ్బారావు.
అలవాటు లేదు సార్ చెప్పాడు బెగ్గర్.
పోనీ పేకాడదాం వస్తావా నీ పెట్టుబడి కూడా నేనే పెడతాను.
నో నాకసలు పేకాడ్డమే రాదు.
సరే నీకో గర్ల్ ఫ్రెండ్ ను పరిచయం చేస్తాను రా! అన్నాడు సుబ్బారావు. ఛీ నా కలాంటివి గిట్టవు. ఐ లవ్ మై వైఫ్ అన్నాడు.
సరే నువ్ మాఇంటికి రావాలి అన్నాడు సుబ్బారావు.
ఎందుకు? ఆశ్చర్యంతో అడిగాడు బెగ్గర్.
నిన్ను మా ఆవిడకు చూపెట్టాలి.
మందు కొట్టనోడు సిగరెట్ తాగకుండా పేకాట గర్ల్ ఫ్రెండ్ లేకుండా కేవలం భార్యని మాత్రమే ప్రేమించే వాడి గతి ఏమవుతుందో నా పెళ్లానికి చూపెట్టాలి.!! ప్లీజ్

పనిమనిషి

భర్త: ఏంటీ శారద కొత్త పనిమనిషి వస్తుంది. కాంతం ఏమైంది?
బార్య:మాన్పించాను.
భర్త:ఎందుకని?
బార్య:ఈమద్య అక్క అని పిలుస్తుందని

అబ్బాయ్: అమ్మాయ్

అబ్బాయ్: నైస్ హెయిర్ స్టైల్, నైల్ లిప్ స్టిక్, నైస్ డ్రెస్...
అమ్మాయ్: థాంక్యూ బ్రదర్...
అబ్బాయ్: అయినా ఒక్కటి కూడా నీకు సూట్ అవ్వడం లేదు. చాలా చండాలంగా కనిపిస్తున్నావ్...
( మరి బ్రదర్ అంటే ఒళ్ళు మండదూ....)

అక్క : చెల్లి

అక్క : చెల్లి!! నామొగుడు ఊరికి వెళ్లాడు. 
ఈరోజు నైట్ నాకు తోడుగా పడుకుంటావా?
.
.
.
.
.
.
.
.
.
చెల్లి : పొవె ...... నీకూ....
నీ మొగుడుకి వేరే పనే లేదు...
నువ్వు ఊరు వెల్తే నీమోగుడు పిలుస్తాడు,
.
నీ మొగుడు ఊరు వెల్తే, నువ్వు పిలుస్తా వు .
సచ్చి పోతున్నా ...!!


Tuesday, 19 January 2016

మేనేజర్ కి అసిస్టెంట్ కి మద్య సరదా సంభాషణ

అసిస్టెంట్ :- సార్ మీరు ఆఫీస్ లో పులిలాగా ఉంటారు మరి ఇంట్లో ?
మేనేజర్ :- పిచ్చోడ పులి ఎక్కడ ఉన్నా పులే రా ...కాకపోతే ఇంట్లో పులి మీద దుర్గా మాత కూర్చొని ఉంటది.


అత్త - కోడలు

కొత్త కోడలు మొదటి సారి వంట చెయదలచె....

వంటల పుస్తకము చదువుతూ వంట మొదలు పెట్టె......

గుడి నుండి అత్త తిరిగి వచ్చే...
ఫ్రిజ్జు తెరచి చూచే...
అచ్చెరువందే....

కోడలింజూచి అడిగె.....

"పూజ గది నుండి ఈ గంట ఫ్రిజ్జ్ లో కెట్ల వచ్చే.?..."

కోడలు : "అత్తమ్మా.... పుస్తకము లో వ్రాసి ఉండె..... మిశ్రమంను బాగుగా కలిపి ఒక 'గంట' ఫ్రిజ్జ్ లో పెట్టవలెనని......"

తండ్రి - కొడుకు

కొడుకు: నాన్న నన్ను OLX వాళ్ళు తిట్టారు.
తండ్రి: నువ్వు ఏదో తింగిరి పని చేసి ఉంటావ్.
కొడుకు: లేదు నాన్న నా దగ్గర ఉన్న పాత సామాను అమ్మకానికి
పెట్టాను అంతే

OLX తో తండ్రి: ఎందుకు మా కొడుకును ఫోన్ చేసి
తిట్టారంట్ట?
OLX ప్రతినిధి : లేకపోతే ఏంటి సార్, ఎంత మా వెబ్ సైట్ లో మీ పాత
సామాన్లు అమ్మేయండి అంటే మాత్రం, 2016 వస్తుంది కదా
అని 2015 క్యాలెండరు అమ్మకానికి పెట్టాడు