Sunday, 7 February 2016

బృందం

ఒక వ్యక్తి పెళ్లి బృందం లో 10 మంది ని కారుతో గుద్ది చంపేసినందుకు కోర్టులో వాయిదా నడుస్తుంది..
జడ్జ్: నువ్వు 10 మందిని ఎలా చంపావయ్యా?
ముద్దాయి: సార్.. నేను రోడ్ మీద వెళ్తుంటే, నా కార్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి.. ఒక వైపు 25 మంది ఉన్న పెళ్లి బ్ర్నదం, మరో వైపు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తున్నారు. మీరైతే కారుని ఎటు వైపు తిప్పుతారు?
జడ్జ్: ఇద్దరు ఉన్న వైపే తిప్పుతా.. ఎందుకంటె ప్రాణ నష్టం తక్కువ జరుగుతుంది కద...
ముద్దాయి; నేను కూడా అదే చేశాను సర్.. కానీ ఆ ఇద్దరూ పరిగెత్తి, పారిపోయి
పెళ్ళి బృందం లో చేరిపోయారు మరి...

పెళ్లి

రవి, పింకీలకి కొత్తగా పెళ్లి అయ్యింది...
పింకీ: ఇంట్లో పనితో అలసిపొతున్నా బాగా... సాయంత్రం అయ్యే సరికి, ఒళ్లంతా ఒకటే నొప్పులు...
రవి: సర్లే అయితే, ఒక పనమ్మాయిని పెట్టుకుందాం...
పింకీ: అబ్బా!! ఏం వద్దు.. నీ సంగతి నాకు బాగా తెలుసు... మర్చిపోయావా.. నేను కూడ మొదట్లో మీ ఇంట్లో పనిమనిషిగానే చేరాను.....